1 యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.
3 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొవచ్చి ఆమెను మధ్యనిలువబెట్టి
4 -బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారముచేయుచుండగా పట్టబడెను;
5 అట్టివారిని రాళ్లు రువ్విచంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి
6 ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో (ఏమో) వ్రాయుచుండెను.
7 వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచి -మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి
8 మరల వంగి నేలమీద వ్రాయుచుండెను
9 వారామాట విని, 1పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకనివెంట ఒకడు బయటికి వెళ్లిరి యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడి యుండెను.
10 యేసు తలయెత్తి చూచి - అమ్మా, వారెక్కడనున్నారు?; ఎవడును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
11 ఆమె - లేదు ప్రభువా అనెను. అందుకు యేసు - నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్లి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
12 మరియు యేసు - నేను లోకమునకు వెలుగునైయున్నాను; నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలవాడై యుండునని వారితో చెప్పెను.
13 కాబట్టి పరిసయ్యులు - నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా
14 యేసు - నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడినుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
15 మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవనికిని తీర్పు తీర్చను.
16 నేను ఒక్కడనైయుండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.
17 మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
18 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యనిచ్చుచున్నాడని చెప్పెను.
19 వారు - నీ తండ్రి యెక్కడనున్నాడని ఆయనను అడుగగా యేసు - మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగియుంటిరా నా తండ్రినికూడ ఎరిగియుందురని వారితో చెప్పెను.
20 ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింక రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
21 మరియొకప్పడు ఆయన -నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనేయుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
22 అందుకు యూదులు - నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పచున్నాడే; తన్నుతానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి.
23 అప్పుడాయన - మీరు క్రిందివారు, నేను పైనుండువాడను, మీరు ఈ లోకసంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.
24 కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
25 కాబట్టి వారు - నీవెవడవని ఆయన నడుగగా యేసు వారితో - మొదటినుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.
26 మిమ్మనుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును అనేక సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
27 తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి.
28 కావున యేసు -మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
30 ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయనయందు విశ్వాసముంచిరి.
31 కాబట్టి యేసు తనయందు విశ్వాసముంచిన యూదులతో -మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యము గ్రహించెదరు;
32 ఆప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
33 వారు - మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమైయుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
34 అందుకు యేసు - పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
35 దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారుడెల్లప్పుడును నివాసముచేయును.
36 కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.
37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుకు నన్ను చంప వెదుకుచున్నారు.
38 నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను.
39 అందుకు వారు ఆయనతో - మా తండ్రి ఆబ్రాహామనిరి; యేసు - మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
40 దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్నుమీరిప్పుడు చంప వెదుకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు.
41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారు - మేము వ్యభిచారమువలన పుట్టినవారముకాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
42 యేసు వారితో ఇట్లనెను- దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్నుపంపెను.
43 మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననే గదా?
44 మీరు మీ తండ్రియగు అపవాది 1సంబంధులు, మీ తండ్రి దరాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు.
45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్నునమ్మరు.
46 నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్ధాపించును? నేను సత్యము చెప్పుచున్న పక్షమున మీరెందుకు నన్ను నమ్మరు?
47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
48 అందుకు యూదులు - నీవు సమరైయుడవును దయ్యము పట్టినవాడవునై యున్నావని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా.
49 యేసు - నేను దయ్యము పట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.
50 నేను నా మహిమను వెదకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.
51 ఒకడు నా మాటగైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడనిమీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.
52 అందుకు యూదులు -నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను - ఒకడు నా మాటగైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్నునీ వెవడనని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
54 అందుకు యేసు -నన్ను నేనే మహిమపరుచుకొనినయెడల నా మహిమ వట్టిది; - మా దేవుడని మీరెవనిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.
55 మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగదును, ఆయన మాట గైకొనుచున్నాను.
56 మీ తండ్రియైన అబ్రాహాము నా దినముచూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను, అందుకు యూదులు - నీకింక ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,
57 యేసు - అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
58 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.
59 కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లను ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్లిపోయెను.
Download Audio File

No comments:
Post a Comment