Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను17వఅధ్యాయము

1  యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను - తండ్రి, నా గడియ వచ్చియున్నది. 
2  నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. 
3  అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యడజీవము. 
4  చేయుటకు నీవునాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. 
5  తండ్రీ, లోకముపుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. 
6  లోకములోనుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితిని; వారు నీ వాక్యము గైకొనియున్నారు. 
7  నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగిస నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. 
8  నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. 
9  నేను వారికొరకు ప్రార్ధనచేయుచున్నాను; లోకముకొరుక ప్రార్ధినచేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి యున్నవారు నీవరైనందున వారికొరకే ప్రార్ధనచేయుచున్నాను. 
10  నావన్నియు నీవి, నీవయు నాని; వారియందు నేను మహిమపరచబడియున్నాను. 
11  నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు నుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 
12  నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపాత్రుడుతప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. 
13  ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. 
14  వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. 
15  నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్ధించుటలేదు గాని దుష్టునినుండివారిని కాపాడుమని ప్రార్ధించుచున్నాను. 
16  నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసమబంధులు కారు. 
17  సత్యమువలనవానిరి ప్రతిష్టచేయుము; నీ వాక్యమే సత్యము. 
18  నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారని లోకమునకు పంపితిని. 
19  వారును సత్యమువలనప్రతిష్టచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్టచేసికొనుచున్నాను.  
20  20-21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమై యుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్ధించుచున్నాను.  
21  20-21. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమై యుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమై యుండవలెనని వారికొరకును ప్రార్ధించుచున్నాను. 
22  మనము ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చితిని. 
23  వారయందు నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు  నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. 
24  తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారుచూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి. 
25  నీతిస్వరూపుడవగు తండ్రీ, లోకము నన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. 
26  నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.

No comments:

Post a Comment