1 గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
2 ద్వారమున ప్రవేశించువాడు గొర్రెలకాపరి.
3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని శబ్దము వినును, అతడు స్వకీయమైన గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలపలికి నడిపించును.
4 మరియు అతడు స్వకీయమైన గొర్రెలనన్నిటిని వెలపలికి నడిపించునప్పుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొర్రెలు అతని శబ్దమెరుగును గనుక అవి అతని వెంబడించును.
5 అన్యుల శబ్దము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాని వారితో అనెను.
6 ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
8 - గోర్రెలు పోవు ద్వారము నేనే : నాకు ముందు వచ్చినవారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొర్రెలు వారి శబ్దము వినలేదు.
9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించినయెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
11 నేను గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొరకు తన ప్రాణము పెట్టును.
12 జీతగాడు గొర్రెల కాపరికాడు గనుక గొర్రెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును; తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును.
13 జీతగాడు జీతగాడే గనుక గొర్రెలునుగూర్చి లక్ష్యముచేయక పారిపోవును.
14-15. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
16 ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా శబ్దమువినును, అప్పుడు మంద యొక్కటియు గొర్రెల కాపరి యొక్కడును అగును.
17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.
18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
20 వారిలో అనేకులు - వాడు దయ్యము పట్టినవాడు వెర్రివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
21 మరికొందరు - ఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలదా అని చెప్పిరి.
22 ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.
23 అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా
24 యూదులు ఆయనచుట్టు పొగై - యెంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
25 అందుకు యేసు -మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు; నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
26 అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు.
27 నా గొర్రెలు నా శబ్దము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
28 నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.
29 వాటిని నాకిచ్చిన నా తండ్రిచేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
30 నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
31 యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకొనగా
32 యేసు - తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
33 అందుకు యూదులు - నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.
34 అందుకు యేసు - మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
35 లేఖనము నిరర్థకము కానేరదు గదా; దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
36 తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోకి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
37 నేను నా తండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
38 చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.
39 వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొనిపోయెను.
40 యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.
41 అనేకులు ఆయనయొద్దకు వచ్చి - యోహాను ఏ సూచకక్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి.
42 అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
Download Audio File

No comments:
Post a Comment