1 తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకుముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని సంపూర్ణముగాప్రేమించెను.
2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాదియింతకుముందు ఆలోచన పుట్టించి యుండెను గనుక
3 తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసియున్నదనియు యేసు ఎరిగి
4 భోజనపంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను.
5 అంతట పళ్లెములో నీళ్లుపోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.
6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు - ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను.
7 అందుకు యేసు -నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
8 పేతురు - నీవెన్నడును నా పాదములు కడుగరాదని అయనతో అనెను. అందుకు యేసు - నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను.
9 సీమోను పేతురు - ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను.
10 యేసు అతని చూచి - స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పనిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.
11 తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక - మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.
12 వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత ఆయన మరల కూర్చుండి - నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
13 బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను మీకు బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
14 కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.
16 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, అపొస్తలుడుతన్ను పంపినవానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.
18 మిమ్ము నందరినిగూర్చి నేను చెప్పలేదు; నేను ఏర్పరచుకొనినవారిని ఎరుగుదును కాని- నాతోకూడ భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెనుఅను లేఖనము నెరవేరుటకై (యీలాగు జరుగును. )
19 జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగకమునుపు మీతో చెప్పుచున్నాను.
20 నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
21 యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి - మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను
22 ఆయన ఎవనిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులుసందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా
23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను
24 గనుక ఎవనిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగచేసెను.
25 అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు - ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను.
26 అందుకు యేసు -నేనొక ముక్క ముంచి యెవనికిచ్చెదనో వాడే అని చెప్పి, యొక ముక్కముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను;
27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు - నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా
28 ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు.
29 డబ్బుసంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటిని కొనుమనియైనను, బీదలకేమైన ఇమ్మనియైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి.
30 వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ.
31 వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను - ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు.
32 దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును.
33 పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును; మీరు నన్ను వెదుకుదురు, నేనెక్కడికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పుచున్నాను.
34 మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్తఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకని నొకడు ప్రేమింపవలెను.
35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
36 సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు - నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని యిటుతరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.
37 అందుకు పేతురు - ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంటరాలేను? నీకొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా
38 యేసు - నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
Download Audio File

No comments:
Post a Comment