1 మృతులలోనుండి యేసుచేత లేపబడిన లాజరు ఉన్న బేతనియకు యేసు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకొరకు విందు చేసిరి.
2 మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు.
3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నరయెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.
4 ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా
5 - యీ అత్తరెందుకు మున్నూరు దేనారములుకు అమ్మిబీదలకు ఇయ్యలేదనెను.
6 వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచి యుంచుకొని ఆందులో వేయబడినది ఎత్తికొని పోవుచువచ్చెను గనుక ఆలాగు చెప్పెను.
7 కాబ్బట్టి యేసు - నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
8 బీదలు ఎల్లప్పుడును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
9 యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.
10-11. అతని చూచిన యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంపనాలోచనచేసిరి.
12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని
13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుగాక అని కేకలువేసిరి.
14 - సీయోను కుమారీ భయపడకుము, ఇదిగో నీ రాజు
15 గాడిదె పిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడుఅని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదెను కనుగొని దానిమీద కూర్చుండెను.
16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి.
17 ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.
18 అందుచేత ఆయన ఆ సూచకక్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి.
19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు - మన ప్రయత్నములెట్లు నిష్ ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.
20 ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు హెల్లెనీయులుండిరి.
21 వారు గలిలైయలోని బేత్సయిదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి - అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా
22 ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.
23 అందుకు యేసు వారితో ఇట్లనెను - మనుష్యకుమారుడు మహిమపొందవలసిన గడియ వచ్చియున్నది.
24 గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగనేయుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును.
25 తన ప్రాణమును ప్రేమించువాడు దాని నశింపజేయువాడు; ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవార్థమై దాని కాపాడువాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
26 ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించియెడల నా తండ్రి అతని ఘనపరచును.
27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? - తండ్రీ, యీ గడియ నాకు తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
28 తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట - నేను దాని మహిమపరచితిని, మరల మహిమపరతును అను నొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
29 కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము - ఉరిమెను అనిరి. మరికొందరు - దేవదూత యొకడు ఆయనతో మాటలాడెననిరి.
30 అందుకు యేసు - ఈ శబ్దము నాకొరకు రాలేదు మీకొరకే వచ్చెను.
31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది; ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును;
32 నేను భూమిమీదనుండి పైకెత్తబడినప్పుడు అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.
33 తాను ఏ విధముగా మరణము పొందవలసియుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
34 జనసమూహము - క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. - మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్యకుమారుడగు ఈయన ఎవడని ఆయన నడిగిరి.
35 అందుకు యేసు - ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు కలిగియున్న వెలుగు కొలది నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు.
36 మీరు వెలుగు సంబంధులగునట్లుమీకు కలిగియున్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారియెదుట ఇన్ని సూచకక్రియలుచేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
38 - ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్కబాహువు ఎవనికి బయలు పరచబడెను?అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.
39-40. ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా -వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొనినావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వముకలుగజేసి వారి హృదయము కఠినపరచెను
41 అని యెషయా మరియొక చోట చెప్పెను. 1యెషయా ఆయన మహిమను చూచినందునఆయననుగూర్చి బోధించుచు ఈ మాటలు చెప్పెను.
42 అధికారులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని సమాజములోనుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు.
43 వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
44 అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను - నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
45 నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
46 నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
47 ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేనతనికి తీర్పు తీర్చను; నేను లోకమును రక్షించుటకే వచ్చితినిగాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు.
48 నన్ను నిరాకనించి నా మాటలను అంగీకరింపనివానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
49 ఏలయనగా నాయంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు.
50 మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.
Download Audio File

No comments:
Post a Comment