Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను21వఅధ్యాయము

1  అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా 
2  సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలైయలోని కానా ఊరి నతనయేలును, జెబెదయి కుమాళ్లును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. 
3  సీమోను పేతురు - నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు - మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు. 
4  సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 
5  యేసు - పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా అని వారిని అడుగగా, 
6  లేదని వారాయనతో చెప్పిరి, అప్పుడాయన -చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగ లేకపోయిరి. 
7  కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు - ఆయన ప్రభువుసుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసికొని సముద్రములో దుమికెను. 
8  దరియించుమించు ఇన్నూరుమూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్నదోనెలో వచ్చిరి. 
9  వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను. 
10  యేసు -మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా 
11  సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను; అది నూట ఏబది మూడు గొప్పచేపలతో నిండియుండెను; 
12  చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు - రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున - నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. 
13  యేసు వచ్చి ఆ రొట్టెయు చేపలును కూడ తీసికొని వారికి పంచిపెట్టెను. 
14  యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి 
15  వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి -యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు - అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు - నా గొర్రెపిల్లలను మేవుమని అతనితో చెప్పెను. 
16  మరల ఆయన - యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు - అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయననా గొర్రెలను కాయుమని చెప్పెను. 
17  మూడవసారి ఆయన - యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా అతనిని అడుగగా అడిగెను. - నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి - ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. 
18  యేసు - నా గొర్రెలను మేపుము. నీవు యౌవనస్థుడవై యుండినప్పుడు నీయంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైనచోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆతనితో చెప్పెను. 
19  అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పును. ఇట్లు చెప్పి - నన్ను వెంబడించుమని అతనితో అనెను. 
20  పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని - ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడుతమ వెంట వచ్చుట చూచెను. 
21  పేతురు అతని చూచి - ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. 
22  యేసు - నేను వచ్చువరకు ఆతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను. 
23  కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని - నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీ కేమని చెప్పెను. 
24  ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము. 
25  యేసు చేసిన కార్యములు ఇంక అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినపక్షమున అట్లు వ్రాయబడిన గ్రంధములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. 
Download Audio File

No comments:

Post a Comment