Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, July 27, 2013

యోహాను16వఅధ్యాయము

1  మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను. 
2  వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నది. 
3  వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు. 
4  అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. 
5  ఇప్పుడు నన్ను పంపినవానియొద్దకు వెళ్లుచున్నాను - నీవు ఎక్కడికి వెళ్లుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని 
6  నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. 
7  అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట మీకు ప్రయోజనకరము; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. 
8  ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకము ఒప్పుకొనజేయును.  
9-11. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రియొద్దకు వెళ్లుటవలన మీరికను నన్నుచూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పుపొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు, ఒప్పుకొనజేయును. 
12  నేను మీతో చెప్పవలసినవి ఇంక అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు. 
13  అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించునట్లుఆయన మిమ్మును నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. 
14  ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. 
15  తండ్రికి కలిగనవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. 
16  కొంచెము కాలమైన తరువాత మీరక నన్నుచూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూతురని చెప్పెను. 
17  కాబట్టి ఆయన శిష్యులలో కొందరు - కొంచెము కాలమైనతరువాత నన్నుచూడరు, మరి కొంచెము కాలమైన తరువాత నన్ను చూతురనియు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్నమాట ఏమిటని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 
18  - కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. 
19  వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను - కొంచెము కాలమైన తరువాత మీరు నన్నుచూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా; 
20  మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
21  స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; ఆయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. 
22  అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్దనుండి తీసివేయడు. 
23  ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
24  ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరివూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. 
25  ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పితిని; అయితే నేనిక ఎన్నడును గూఢార్ధముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. 
26  ఆ దినమందు మీరు నా పేరట ప్రార్ధనచేతురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. 
27  మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు, 
28  నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. 
29  ఆయన శిష్యులు - ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్ధముగా ఏమియు చెప్పుక స్పష్టముగా మాటలాడుచున్నావు. 
30  సమస్తము ఎరిగినవాడనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా 
31  యేసు వారిని చూచి - మీరిప్పుడు నమ్ముచున్నారు? 
32  యిదిగో మీలో ప్రతివాడును ఎవడు వాని యింటికి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. 
33  నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. 
Download Audio File

No comments:

Post a Comment