1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలైయ దాటి అద్దరికి వెళ్లెను.
2 రోగులయెడల ఆయన చేసిన సూచకక్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి
3 యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను
4 అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
5 కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి - వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని
6 యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతని శోధించుటకు ఆలాగడిగెను.
7 అందుకు ఫిలిప్పు - వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఇన్నూరు దేనారములరొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను
8 ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
9 - ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలును రెండు చిన్న చేపలును ఉన్నవిగాని, యింతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
10 యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక యుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదు వేల పురుషులు కూర్చుండిరి.
11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను; ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.
12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.
13 కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పన్నెండు గంపెళ్లు నింపిరి.
14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి - నిజముగా ఈ లోకమునుక రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపు అద్దరికి కపెర్నహూముకు పోవుచుండిరి.
17 అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంక రాలేదు.
18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గెరకు వచ్చుట చూచి భయపడిరి;
20 అయితే ఆయన - నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
21 అంతట ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారికిష్టమాయెను. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న దేశమునకు చేరెను.
22 మరునాడు సముద్రపు అద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్నదోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులుమాత్రమే వెళ్లిరనియు తెసికొనిరి.
23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పురడు వారు రొట్టె భుజించిన చోటుకు దగ్గెరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చిరి.
25 సముద్రపు అద్దిరిని ఆయనను కనుగొని - బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
26 యేసు - మీరు సూచకక్రియలను చూచుటవలన కాదు, రొట్టెలు భుజించి తృప్తిపొందుటవలననే నన్ను వెదుకుచున్నారని మీతో నీశ్చయముగా చెప్పుచున్నాను.
27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
28 వారు - మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా
29 యేసు - ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
30 వారు - అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకక్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?
31 భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అనివ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
32 కాబట్టి యేసు - పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు.
33 పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
34 కావున వారు - ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడు మాకు అనుగ్రహించుమనిరి.
35 అందుకు యేసు వారితో ఇట్లనెను - జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.
36 మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువాని నేనెంతమాత్రమును బయటికి తోసివేయను.
38 నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.
39 ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమియు పోగొట్టకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై యున్నది.
40 కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వాని లేపుదును.
41 నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు -
42 ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
43 అందుకు యేసు - మీలో మీరు సణుగుకొనకుడి;
44 నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నాయొద్దకు రాలేడు; అంత్యదినము నేను వాని లేపుదును.
45 - వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.
46 దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు.
47-48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే
49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
50 ప్రతివాడును తిని చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే.
51 పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
52 యూదులు - ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
53 కావున యేసు ఇట్లనెను - మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు.
54 నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వాని లేపుదును.
55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.
56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.
57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రిమూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
58 ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు (మన్నాను ) తినియు చనిపోయినట్టుకాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
61 యేసు తన శిష్యులు దీనిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను - దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?
62 అలాగైతే మీరు మనుష్యకుమారుడు మునుపున్నచోటుకు ఎక్కుట చూచినయెడల ఏమందురు?
63 ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్నమాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని
64 మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసుకు తెలియును.
65 మరియు ఆయన - తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.
66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.
67 కాబట్టి యేసు - మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా అని పన్నెండుమందిని అడుగగా
68 సీమోను పేతురు - ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;
69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.
70 అందుకు యేసు - నేను పన్నెండుగురైన మిమ్మును ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు అపవాది అని వారితో చెప్పెను.
71 సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా పన్నెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment