1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను. దానిలోకి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.
2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడకి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.
3 కావున యూదా రాణువవారిని, ప్రధానయాజకులును పరిసయ్యులను పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.
4 యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి -మీరెవని వెదుకుచున్నారని వారిని అడిగెను.
5 వారు - నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు - నేనే ఆయననని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
6 ఆయన - నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల పడిరి.
7 రెండవసారి ఆయన - మీరు ఎవని వెదుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా
8 యేసు వారితో - నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.
9 - నీవు నాకు అనుగ్రహించినవారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
10 సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దాని దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.
11 ఆ దాసుని పేరు మల్కు. యేసు అది చూచి - కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
12 అంతట రాణువవారును, సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
13 అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
14 కయప - ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోకి యేసుతో కూడ వెళ్లెను.
16 పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటకి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
17 ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురును చూచి - నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు - కాననెను.
18 అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.
19 ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధనగూర్చియు యేసును అడుగగా
20 యేసు -నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
21 నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.
22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్నబంట్రౌతులలో ఒకడు - ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
23 అందుకు యేసు - నేను కాని మాట ఆడిన పక్షమున ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన పక్షమున నన్నేల కొట్టుచున్నావనెను.
24 అంతట అన్న యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.
25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి - నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు - నేను కాను, నేనెరుగననెను.
26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వానికి బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును - నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు
27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోకి వెళ్లలేదు.
29 కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి - ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
30 అందుకు వారు - వీడు దుర్మార్గుడు కానియెడల వీని నీకు అప్పగింపకుందుమని అతనితో చెప్పిరి.
31 పిలాతు - మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
32 యూదులు - ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో అది సూచించి చెప్పిన మాట నెరవేరెను.
33 పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి - నీవు యూదుల రాజువా అని ఆయననడుగగా
34 యేసు -నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా అని అడిగెను
35 అందుకు పిలాతు - నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా
36 యేసు - నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యముఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
37-38. అందుకు పిలాతు -నీవు రాజువా అని అయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టతిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు - సత్యమేమిటో అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులయొద్దకు తిరిగి వెళ్లి - అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదలచేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదలచేయుట మీకిష్టమా అని వారి నడిగెను.
40 అయితే వారు - వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
Download Audio File

No comments:
Post a Comment